ఎప్పుడూ లేనంతగా క్రిష్ణమ్మ కోపం చూపించింది మన మీద తన చెల్లి తుంగభద్ర తో కలసి. కనీ వినీ ఎరుగని రీతిలోకర్నూలు ను, విజయవాడ లంక గ్రామాలను మౄత్యువాకిల్లు గా మార్చింది. ఈ విషయంలో మానవ తప్పిదాలు ఎన్నిఉన్నాయో పరిస్థితి చూస్తేనే తెలుస్తుంది. ఆ భయానక, భీభత్సాలను ప్రజలకు చూపడంలో మీడియా ప్రముఖ పాత్రనువహించింది. ఒక అడుగు వేసి నేను ఈ మూలకు వచ్హి మీకు చూపుతున్నాను అంటూ విలేకరులు ఎన్ని అడుగులువేసారో మనం మర్చిపోదామన్నా మర్చిపోకుండా పదే పదే అదే విషయాన్ని పరికించమంటూ పనిగట్టుకుకూర్చునిచూపెట్టారు. ప్రజలకు తెలియని విషయాన్ని గూర్చి తెలపడం హర్షదాయకమైన విషయమే. కాని మేము మాత్రమేతెలుపుతున్నామంటూ పదే పదే చిన్న విషయాలను కెమెరాలకు భూతద్దాలను తగిల్చి చూపడం హాస్యాస్పదంగా ఉంది. కష్టాలలో ఉన్నప్పుడు సాయం చెయ్యడం మనిషి గా మన ధర్మం. ఆ ధర్మాన్ని పాటించడంలో మీడియా మంచిపనితీరును కనపరిచింది. దాంతో పాటు ఆ ధర్మాన్ని నెరవేర్చింది మేమేనంటూ చూపుకోవడం ఎంత వరకు సమంజసం. పోటీ తత్వం తో తమను తాము గొప్పగా చూపుకోవడం కోసం చిన్న విషయాలను, జరగవచ్హు అని వూహించి ఆవిషయాలను కూడ జరిగిపోయినట్టు చూపించడం ఎంతవరకు సమంజసం. ఆ న్యాయానికి ప్రతిరూపాలమంటూచెప్పుకునే మీడియా కు ఇది ఎంత వరకు (అ)న్యాయం. క్రిష్ణమ్మ తన కోపం తగ్గించుకున్న తర్వాత తోటివారికిసాయపడమంటూ చేసే అభ్యర్ధన అందరినీ కదిలించింది. అభ్యంతరాలు లేకుండా సాగుతున్నది. కాని,అభ్యర్ధన కి కూడాపోటీ తత్వాన్ని ఆపాదించడం ఎంతవరకు సబబు గా ఉంది. ఎంతో కష్టపడి మన టీవీ ఛానల్ మాత్రమే వచ్హింది - ప్రజలకువాస్తవాలను తెలపడం కోసం , అధికారులకు తెలియచేయడం కోసం , అంటూ మూల మూలలకి వెళ్ళారు. ఇది అందరూఆమోదించే విషయమే, అందరూ ఆనందించాల్సిన విషయమే. కాని మీరు చేసిన పని, చేయాల్సిన పనిని పదేపదేమనము(మనసులో మేము) మాత్రమే చేసాము అంటూ టీవీ రేటింగ్ కి క్రొత్త బాష్యం చూపారు.
మొన్న ఆ మధ్య ప్రముఖ నాయకుడు ఒకరి హెలికాప్టర్ ఆచూకి తెలియనప్పుడు ఈ మీడియా ప్రతినిధులు వెలువరించినఅస్పస్ట కధనాలు ఇంకా మన స్మ్రుతిపధం నుండి ఇంకా తొలగిపోకమునుపే ఈ విధంగా మానవత్వం నిండిన మనిషిచేయాల్సిన పనిని ఒక సంస్థ తో, తన వ్యక్తిగత విషయాలకు ఆపాదించడం మీరే ఆలోచించుకోవాలి.
చివరగా, ఒక మాట. మనం కూడ ఈ సమాజం లొ మనుషులమే!!!