Dec 17, 2010

"నాహం కర్త : హరి కర్త:"

కొత్త పుస్తకం అంటే ఇష్టపడకుండా ఉండని పాఠకులలో నేను కూడా ఒకణ్ణి . అలాగని ప్రతి క్రొత్త పుస్తకం చదివే అలవాటు కూడా లేదు, కాని క్రొత్తగా కనిపించిన వాటిలో చాలా వాటిని చదువుతాను.

పుస్తక పఠనం ఎప్పుడు అలవాటుగా మారిందో నాకు తెలియదు కాని, ఆ అలవాటు మాత్రం మా అన్నయ్య దగ్గరనుండి వచ్చింది. ఇప్పుడు నేను వ్రాయబోయే అంశం చాలాకాలం క్రితం చదివిన ఇప్పటికి, ఎప్పటికి, క్రొత్త ఆనందాన్ని, ఆహ్లాదాన్ని, ముఖ్యంగా ఆధ్యాత్మికతను అందించిన P.V.R.K. ప్రసాద్ గారి

"నాహం కర్త: హరి కర్త:"

ఎప్పుడు తిరుపతి వెళ్ళి రావటమే తప్ప, యాత్ర అనుభవాల గురించి గాని, యాత్ర విశిష్టత గురించి గాని, అక్కడి వ్యవస్థల గురించి గాని ఎప్పుడూ కూడా ఆలోచించలేదు. కాని ప్రసాద్ గారి హయాంలో జరిగిన సంఘటనలు, వాటిని ఆయన ఎదుర్కొన్న (స్వామి ఆయనను నడిపించిన) తీరు చదువుతున్నంతసేపు, చదివిన తరువాత కూడా నా రోమాలు తమ సహజ స్థితికి రావటానికి చాలాసేపు పట్టింది అన్నది మాత్రం నిజం.

నేను ఈ పుస్తకం చదివిన (స్వామి నన్ను చదివించిన) తీరు నాకు చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఈ పుస్తకం లో నేను మొదట చదివిన అంశం "గోగర్భం డ్యాం". మహా వేదపండితులు "బ్రహ్మశ్రీ" ఉప్పులూరి గణపతి శాస్త్రి గారి నేతృత్వంలో, ప్రసాద్ గారు ఎంతో నమ్మకంతో చేయించిన (స్వామి తన ఉనికిని నాలాంటి అజ్ఞానులకు చూపటానికి) వరుణయాగ విశేషాలు చదువుతుంటే నిజంగా ఒడలు జలదరించి పులకరించింది. ఆనాటినుండి ప్రారంభించి మొత్తం 6 రోజులలో ఆ పుస్తకం చదవడం పూర్తి చేసాను. నాటి నుండి నేటి వరకు ఎన్నెన్నో అంశాలు, పరిస్థితులు, స్మ్రుతులు ఆ పుస్తకాన్ని మరల మరల చదివే అవకాశం నాకు కల్పిస్తున్నాయి.

ముఖ్యంగా కాలిబాట లో నిర్మాణం, రాత్రిపూట స్వామి వారి ఆలయంలో గంటలు మ్రోగటం, ప్రసాద్ గారి కుమార్తె వివాహం, ఆలయంలో మిరాశీ విధానం మార్చటంలో వారి అనుభవాలు, స్వామి వారి తిరునామం విషయంలో సందిగ్దత, స్వామివారి శుక్రవార అభిషేక అనుభవాలు ... ఇలా ఎన్నో, ఎన్నెన్నో నా మనసుకు చాలా హత్తుకునే విధంగా వ్రాసిన ప్రసాద్ గారి రచనా నైపుణ్యానికి, ఆ విధంగా వారిచే వ్రాయించిన స్వామివారి కృపాకటాక్షవీక్షణాలకు శిరసువంచి నమస్కరిస్తున్నాను.

Nov 30, 2009

మీ(ఐ)డియా ?!

ఎప్పుడూ లేనంతగా క్రిష్ణమ్మ కోపం చూపించింది మన మీద తన చెల్లి తుంగభద్ర తో కలసి. కనీ వినీ ఎరుగని రీతిలోకర్నూలు ను, విజయవాడ లంక గ్రామాలను మౄత్యువాకిల్లు గా మార్చింది. విషయంలో మానవ తప్పిదాలు ఎన్నిఉన్నాయో పరిస్థితి చూస్తేనే తెలుస్తుంది. భయానక, భీభత్సాలను ప్రజలకు చూపడంలో మీడియా ప్రముఖ పాత్రనువహించింది. ఒక అడుగు వేసి నేను మూలకు వచ్హి మీకు చూపుతున్నాను అంటూ విలేకరులు ఎన్ని అడుగులువేసారో మనం మర్చిపోదామన్నా మర్చిపోకుండా పదే పదే అదే విషయాన్ని పరికించమంటూ పనిగట్టుకుకూర్చునిచూపెట్టారు. ప్రజలకు తెలియని విషయాన్ని గూర్చి తెలపడం హర్షదాయకమైన విషయమే. కాని మేము మాత్రమేతెలుపుతున్నామంటూ పదే పదే చిన్న విషయాలను కెమెరాలకు భూతద్దాలను తగిల్చి చూపడం హాస్యాస్పదంగా ఉంది. కష్టాలలో ఉన్నప్పుడు సాయం చెయ్యడం మనిషి గా మన ధర్మం. ధర్మాన్ని పాటించడంలో మీడియా మంచిపనితీరును కనపరిచింది. దాంతో పాటు ధర్మాన్ని నెరవేర్చింది మేమేనంటూ చూపుకోవడం ఎంత వరకు సమంజసం. పోటీ తత్వం తో తమను తాము గొప్పగా చూపుకోవడం కోసం చిన్న విషయాలను, జరగవచ్హు అని వూహించి విషయాలను కూడ జరిగిపోయినట్టు చూపించడం ఎంతవరకు సమంజసం. న్యాయానికి ప్రతిరూపాలమంటూచెప్పుకునే మీడియా కు ఇది ఎంత వరకు ()న్యాయం. క్రిష్ణమ్మ తన కోపం తగ్గించుకున్న తర్వాత తోటివారికిసాయపడమంటూ చేసే అభ్యర్ధన అందరినీ కదిలించింది. అభ్యంతరాలు లేకుండా సాగుతున్నది. కాని,అభ్యర్ధన కి కూడాపోటీ తత్వాన్ని ఆపాదించడం ఎంతవరకు సబబు గా ఉంది. ఎంతో కష్టపడి మన టీవీ ఛానల్ మాత్రమే వచ్హింది - ప్రజలకువాస్తవాలను తెలపడం కోసం , అధికారులకు తెలియచేయడం కోసం , అంటూ మూల మూలలకి వెళ్ళారు. ఇది అందరూఆమోదించే విషయమే, అందరూ ఆనందించాల్సిన విషయమే. కాని మీరు చేసిన పని, చేయాల్సిన పనిని పదేపదేమనము(మనసులో మేము) మాత్రమే చేసాము అంటూ టీవీ రేటింగ్ కి క్రొత్త బాష్యం చూపారు.
మొన్న మధ్య ప్రముఖ నాయకుడు ఒకరి హెలికాప్టర్ ఆచూకి తెలియనప్పుడు మీడియా ప్రతినిధులు వెలువరించినఅస్పస్ట కధనాలు ఇంకా మన స్మ్రుతిపధం నుండి ఇంకా తొలగిపోకమునుపే విధంగా మానవత్వం నిండిన మనిషిచేయాల్సిన పనిని ఒక సంస్థ తో, తన వ్యక్తిగత విషయాలకు ఆపాదించడం మీరే ఆలోచించుకోవాలి.
చివరగా, ఒక మాట. మనం కూడ సమాజం లొ మనుషులమే!!!